9

ముద్ర,తెలంగాణ:- వానాకాలం సీజన్ నుంచే పంట సాగు చేసే రైతులకు రైతు భరోసా ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. జులైలో ఎకరానికి రూ.7500 చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తుంది. అయితే రైతుల నుంచి అఫిడవిట్ తీసుకున్న కౌలుదార్లకు మాత్రమే రైతు భరోసా సాయం అందుతుందని చెప్పారు. అలాగే ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ కూడా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీకి తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు.