Tuesday, March 17, 2026
Home » తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..గుట్కాపై నిషేధం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..గుట్కాపై నిషేధం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..గుట్కాపై నిషేధం - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • అమ్మినా,తయారు చేసిన కేసులు

ముద్ర,తెలంగాణ:-రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యానికి హానిక‌ర‌మైన గుట్కాను నిషేధించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు గుట్కా తయారీ, అమ్మ‌కాల‌పై నిషేధం విధిస్తూ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉత్తర్‌వులు జారీ చేశారు. ఈ ఏడాది మే 24 నుంచి ఏడాది కాలం పాటు ఈ నిబంధ న‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని ఆదేశాల్లో స్ప‌ష్టం చేశారు. గుట్కా, పాన్ మసాలాలో ఆరోగ్యానికి హాని కలిగించే పొగకు, నికోటిన్ ఉండడాన్ని మూలంగానే వాటిని నిషేధించినట్లు పేర్కొన్నారు. గుట్కాను త‌యారు చేసినా, నిల్వ ఉంచినా, విక్ర‌యాలు జ‌రిపిన చ‌ట్ట‌ప‌ర‌మైన చార్య‌లు తీసుకుంటామ‌ని అధికారులు హెచ్చ‌రించారు.

2021లో కూడా పొగకు ఉత్పత్తులపై నిషేధం విధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. పొగాకు ఉత్పత్తులను నిషేధించాలంటూ 160 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేసిన ధర్మాసనం.. వాటిని నిషేధించే పరిగణలోకి ప్రభుత్వానికి సూచించింది. కానీ, అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి గుట్కా నిషేధంపై నిర్ణయం తీసుకున్నారు. శనివారం నార్కోటిక్ బ్యూరోతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో గుట్కా తయారీ, అమ్మకాలపై చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే వాటిని నిషేధించాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఆదివారం జారీ చేసింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch