Friday, March 20, 2026
Home » చంద్రబాబు నాయుడు నామినేషన్ – ఇవాళ కుప్పంలో చంద్రబాబు తరపున సతీమణి భువనేశ్వరి నామినేషన్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

చంద్రబాబు నాయుడు నామినేషన్ – ఇవాళ కుప్పంలో చంద్రబాబు తరపున సతీమణి భువనేశ్వరి నామినేషన్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 చంద్రబాబు నాయుడు నామినేషన్ - ఇవాళ కుప్పంలో చంద్రబాబు తరపున సతీమణి భువనేశ్వరి నామినేషన్ - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఏపీలో ఎన్నికల కోలాహలం కొనసాగుతుంది. ఓ వైపు ప్రచారాలు, సభలతో హోరెత్తిస్తోన్న నేతలు ఇప్పుడు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకావడంతో నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి భువనేశ్వరి చిత్తూరు జిల్లా కుప్పంలో నామినేషన్ వేయనున్నారు.

చంద్రబాబు తరపున ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. చంద్రబాబు పొలిటికల్ లైఫ్‌లో మొదటిసారి ఆయన సతీమణి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. కుప్పం పీఈఎస్ మెడికల్ కాలేజీలోని గెస్ట్‌హౌస్ నుంచి బయల్దేరుతారు. కుప్పంలోని శ్రీవరదరాజ స్వామి ఆలయంలో నామినేషన పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి మధ్యాహ్నం ఒంటి గంటా 27 నిమిషాలకు చంద్రబాబు తరపున నామినేషన్ దాఖలు చేశారు భువనేశ్వరి.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch