Friday, October 18, 2024
Home » వెళ్లి పవన్ కల్యాణ్ తో సంసారం చెయ్… అప్పుడైనా నీకు బుద్ధి వస్తుంది: సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శలు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

వెళ్లి పవన్ కల్యాణ్ తో సంసారం చెయ్… అప్పుడైనా నీకు బుద్ధి వస్తుంది: సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శలు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 వెళ్లి పవన్ కల్యాణ్ తో సంసారం చెయ్... అప్పుడైనా నీకు బుద్ధి వస్తుంది: సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శలు - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ తిరుపతి జిల్లా సత్యవేడులో ప్రజాగళం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ… నీ తాత జాగీరు అని రాష్ట్రంలో దోపిడీ చేస్తున్నావా? నువ్వు దోచుకుంటే ప్రశ్నించకూడదా? అంటూ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే పరారవుతారు వీళ్లు… ఆ తిరుగుబాటు నుంచి సత్యవేడు నుంచి ప్రారంభం కావాలి అని చంద్రబాబు.

“అసెంబ్లీ సాక్షిగా బూతులు తిడతారు. ఎవడైతే ఎక్కువ బూతులు తిడతాడో వాడికి మంత్రి పదవి! ఇంకా ఎక్కువ బూతులు తిడితే వాడికి ప్రమోషన్! నా మీద దాడి చేసిన వాడికి ఒక మంత్రి పదవి! నా మిత్రుడు పవన్ కల్యాణ్ పై దాడి చూశారా? పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వస్తే నీకెందుకంత కడుపుమంట? ఒక నీతి నిజాయతీతో రాష్ట్రం కోసం ముందుకు వచ్చిన వ్యక్తి పవన్ కల్యాణ్.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని, కూటమి ఏర్పడాలని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కల్యాణ్. అలాంటి వ్యక్తిని నోటికొచ్చినట్టు మాట్లాడతావా? రాష్ట్రమంతా దోచేసిన నువ్వా ఆయనపై అవినీతి ఆరోపణలు చేస్తారా? నువ్వు ఆయన కాలి గోటికి కూడా సరిపోవు.

ఇవాళ పవన్ ఒక సినిమాలో నటిస్తే డబ్బులు ఇస్తారు… సూపర్ స్టార్ ఆయన! రాజకీయాలు లేకపోతే ఈ జగన్ మోహన్ రెడ్డి ఒక్క నయా పైసాకు పనికొస్తాడా? ఏదైనా ఒక్క పని చేసే సత్తా ఉందా నీకు?

నువ్వు ఆయన పెళ్లాల గురించి మాట్లాడతావా? అందుకే ఆయన అన్నాడు… ఓకే, నువ్వు కూడా రారా నీతో కూడా సంసారం చేస్తానన్నాడు. సిగ్గున్న వాడైతే జగన్ మోహన్ రెడ్డి మాట్లాడతాడా? అందుకే అంటున్నా… వెళ్లి పవన్ కల్యాణ్ తో సంసారం చెయ్… అప్పుడైనా నీకు బుద్ధి వస్తుంది” అంటూ చంద్రబాబు సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఇవాళ పవన్ కల్యాణ్ రాజానగరం వారాహి విజయభేరి సభలో సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. సీఎం జగన్ నిన్న కాకినాడ సభలో మాట్లాడుతూ, ప్యాకేజి స్టార్ కు పెళ్లిళ్లే కాదు నియోజకవర్గాలు కూడా నాలుగైదు అని వ్యంగ్యం ప్రదర్శించారు.

ఈ వ్యాఖ్యలకు పవన్ ఇవాళ బదులిచ్చారు. “పరదాల మహారాణి… నిన్న నాతో చాలామంది చెప్పారు. సార్ నిన్న మీ నాలుగో పెళ్లానికి చాలా అవమానం జరిగింది. నువ్వు నా గురించి మరోసారి మాట్లాడితే, జగన్ నా నాలుగో పెళ్లాం అని జనాలు మాట్లాడతారు జాగ్రత్త!” అంటూ వార్నింగ్ ఇచ్చారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch