Thursday, March 19, 2026
Home » భాగ్యనగరంలో కొత్త వైరస్.. భయపడుతున్న నగరవాసులు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

భాగ్యనగరంలో కొత్త వైరస్.. భయపడుతున్న నగరవాసులు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 భాగ్యనగరంలో కొత్త వైరస్.. భయపడుతున్న నగరవాసులు - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,హైదరాబాద్:-హైదరాబాద్‌లో కొత్తరకం వైరస్ బయటపడింది. నగరవాసులు ఎక్కువగా ఆరోగ్యపరమైన ఇబ్బందులకు గురవుతున్నారు. గత కొద్ది రోజులుగా ఆసుపత్రులకు జనం క్యూ కడుతున్నారు. పెద్ద అయితే ఇబ్బంది పెట్టకపోయినా గొంతు నొప్పి, ఒళ్లునొప్పులు, జలుబుతో చాలా మంది బాధపడుతున్నారు. ఇది వైరస్ ప్రభావమేనని వైద్యులు చెబుతున్నారు. గత వారం నుంచి ఇలాంటి లక్షణాలతో ఎక్కువమంది ఆసుపత్రులకు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ఇది ఒకరి నుంచి మరొకరికి సులువుగా వ్యాప్తి చెందుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఇదే లక్షణాలతో బాధపడుతున్నారు.

గొంతు గరగరగా అనిపించడంతో ఈ వ్యాధి ప్రారంభమై తర్వాత ఒళ్లునొప్పులు, జ్వరం వస్తున్నాయని చెప్పారు. అనేక మంది నీరసంగా ఉండటంతో మరో కొత్త వైరస్ వచ్చిందని జనం భయపడిపోతున్నారు. జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు సాధారణంగా సీజన్ మారినప్పుడు కనిపించేవేనని వైద్యులు చెబుతున్నారు. దీనికి భయపడాల్సిన పనిలేదని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా ఒక్కసారి భారీగా నమోదై తగ్గడం వల్ల కూడా ఇలాంటి లక్షణాలు కనిపించడం లేదు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch