Tuesday, February 24, 2026
Home » “నవ సందేహాల” పేరుతో సిఎం జగన్‌కు షర్మిల మరో లేఖ… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

“నవ సందేహాల” పేరుతో సిఎం జగన్‌కు షర్మిల మరో లేఖ… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 "నవ సందేహాల" పేరుతో సిఎం జగన్‌కు షర్మిల మరో లేఖ... - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:- తన సోదరుడు, సీఎం జగన్ కు ఏపీసీసీ చీఫ్ షర్మిల మరో బహిరంగ లేఖను రాశారు. ‘నవ సందేహాలు’ పేరుతో ఇప్పటికే షర్మిల ఒక లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె మరో లేఖను సంధించారు. ఆ లేఖలో జగ‌న్ ను ఏం ప్ర‌శ్నించారంటే…

25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామని అన్నారు. మీరు చేసిందేమిటి? 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మీ హామీ ఏమైంది? ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. ఎందుకు ఇవ్వలేదు? నిరుద్యోగులు 7.7 శాతం పెరగడం మీ ప్రభుత్వ వైఫల్యం కాదా? 23 వేలతో మెగా డీఎస్సీ అన్నారు. 6 వేలతో దగా డీఎస్సీ ఎందుకు వేశారు? యూనివర్శిటీల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఎందుకు భర్తీ చేయలేదు? గ్రూప్-2 కింద ఒక్క ఉద్యోగం కూడా ఎందుకు భర్తీ చేయలేదు? యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు ఎందుకు వెళ్తున్నారు? జాబు రావాలంటే మీ పాలన పోవాలి అని అంగీకరిస్తారా? అని షర్మిల సందేహాలను వ్యక్తపరిచారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch