Saturday, March 14, 2026
Home » ఎన్నికల లెక్కింపు సజావుగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

ఎన్నికల లెక్కింపు సజావుగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 ఎన్నికల లెక్కింపు సజావుగా నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


ముద్ర ప్రతినిధి, జగిత్యాల: లోకసభ ఎన్నికల లెక్కింపు సజావుగా, ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం లెక్కించాలనీ జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కౌంటింగ్ సూపర్ వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లకు శిక్షణ శిభిరం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, లోకసభ ఎన్నికల కౌంటింగ్ ఎన్నికల నిబంధనల మేరకు చేపట్టాలని అన్నారు. కౌంటింగ్ కు కేటాయించబడిన సిబ్బంది సమయానికి హాజరుకావాలని అన్నారు.

ఎలాంటి తప్పులకు తావివ్వకుండా సమయ స్ఫూర్తితో విధులు నిర్వహించాలని అన్నారు. ఓట్ల లెక్కింపు కు కేటాయించబడిన సిబ్బంది చివరి వరకు ఎలాంటి లెక్కింపు చేపట్టాలో చివరి ర్యాండమైజేశన్ తరువాత తెలుస్తుందని చెప్పారు. కౌంటింగ్ కు కేటాయించబడిన సిబ్బంది బ్యాలెట్, కంట్రోల్ యూనిట్, వి.వి. ప్యాట్ ల లెక్కింపులు కేటాయించబడ్డాయి. లెక్కింపు సమయంలో జాగ్రత్తగా ఎలాంటి తప్పులు లేకుండా విధులు నిర్వహించాలని తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమాలను ఉదయం నుండి మాస్టర్ శిక్షకులు పడాల తిరుపతి వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. రాంబాబు, జగిత్యాల, మెట్ పల్లిఆర్డీఓ లు పి.మధుసూదన్, శ్రీనివాస్, ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch