అమరావతి, ఈవార్తలు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన సచివాలయంలో మంగళవారం 227వ స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ SLBC సమావేశం జరిగింది. ఈ రోజు 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.5,40,000 కోట్లతో ఎల్‌ఎల్‌బీసీ రుణ ప్రణాళిక విడుదలైంది. అందులో 3.75 లక్షల కోట్ల రూపాయలను ప్రాధాన్య రంగాలకు, రూ.1.65 లక్షల కోట్లు ఇతర రంగాలకు కేటాయిస్తూ రుణ ప్రణాళికను రూపొందించారు. డైరీ, పౌల్ట్రీ, ఫిషరీస్, వ్యవసాయ యంత్రీకరణ, వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలకు రూ.32,600 కోట్లతో రుణ ప్రణాళిక ప్రకటనలు.
ఈ సమావేశంలో 5 ప్రధాన ఫలితాలు సాధించేందుకు ఏపీ ప్రభుత్వం, బ్యాంకర్లతో కలిపి సబ్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ రంగానికి 2.64 లక్షల కోట్ల రుణాలు ఇవ్వడమే లక్ష్యం పెట్టుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, యూనియన్ బ్యాంక్ ఈడీ సంజయ్ రుద్ర, ఎస్ఎల్‌బీసీ కన్వీనర్ సీవీఎన్ భాస్కర్ రావు, ఇతర బ్యాంకు అధికారులు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.