Sunday, March 15, 2026
Home » AP TET : ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 3 నుంచి పరీక్షలు – News Watch

AP TET : ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 3 నుంచి పరీక్షలు – News Watch

by News Watch
0 comment
AP TET : ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 3 నుంచి పరీక్షలు



అమరావతి, ఈవార్తలు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5 నుంచి ఆగస్టు 20 వరకు పరీక్షలు జరగాల్సి ఉండగా, ఆ పరీక్షలను అక్టోబర్ 3వ తేదీ నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు నిర్వహించామని తాజాగా ప్రకటించింది. ఈ మేరకు మార్పులు చేసిన షెడ్యూల్‌ను సెట్ చేయండి. సన్నద్ధమయ్యేందుకు సమయం కావాలని అభ్యర్థులు కోరడంతో సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. సోమవారం కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పరీక్ష ఫలితాలను నవంబర్ 2వ తేదీన విడుదల చేయనుంది. రాష్ట్రంలో మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సీఎం చంద్రబాబు సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఆ పరీక్షను దృష్టిలో పెట్టుకొని తాజాగా టెట్ రాసే అభ్యర్థులకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డీఎస్సీలో టెట్‌కు 20 శాతం ఉంటుంది.కొత్త షెడ్యూల్ వివరాలు ఇవే..నోటిఫికేషన్ విడుదల తేదీ : జూలై 2పరీక్ష ఫీజు గడువు : ఆగస్టు 3ఆన్‌లైన్ మాక్ టెస్ట్ : సెప్టెంబర్ 19 నుంచి టెట్ ఎగ్జామ్ : అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు ప్రైమరీ కీ : అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు 27రిజల్ట్స్ : నవంబర్ 2

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch