Thursday, March 12, 2026
Home » తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల షెడ్యూల్ ఇదే – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల షెడ్యూల్ ఇదే – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల షెడ్యూల్ ఇదే - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా వేడుకలకు ఏర్పాట్లు చేశారు. జూన్ 2న ఉదయం 9.30కు గన్ పార్క్‌లో అమర వీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్ తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి నివాళులు అర్పిస్తారు.ఆరోజు ఉదయం 10 గంటలకు పేరేడ్ గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. పోలీసు బలగాల పరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు.

అనంతరం సోనియాగాంధీ ప్రసంగం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. పోలీసు సిబ్బందికి, ఉత్తమ కాంటింజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు స్వీకర్తలతో ఫోటో సెషన్ అనంతరం కార్యక్రమం ముగుస్తుంది.మరోవైపు, జూన్ 2 సాయంత్రం ట్యాంక్ బండ్‌పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభమయ్యాయి. తెలంగాణకు సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6.30కు ముఖ్యమంత్రి ట్యాంక్ బండ్‌కు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహించారు.దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొన్నారు.

అనంతరం ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసిన వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు. స్టేజ్ షో అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్‌పై ఇటు చివర నుంచి అటు చివరి వారానికి భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహించారు. ఇందులో దాదాపు 5 వేల మంది పాల్గొంటారు. ఈ ఫ్లాగ్ వాక్ జరుగుతున్నంత సేపు జయ జయహే తెలంగాణ ఫుల్ వర్షం (13.30 నిమిషాల) గీతాన్ని విడుదల చేస్తారు. అదే వేదికపై తెలంగాణ కవి అందెశ్రీ, దర్శకుడు ఎంఎం కీరవాణికి సన్మానం చేస్తారు.రాత్రి 8.50 గంటలకు పది నిమిషాల పాటు హుస్సేన్ సాగరం మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా బాణాసంచా సంగీత వేడుకలను ముగిస్తారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch