47
కొప్పు గుండుపాలెం మైనర్ బాలిక హత్యా ఘటన దురదృష్టకరమని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. నిందితుడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయనీ.. ఎట్టిపరిస్థితుల్లో నిందితుడిని పట్టుకుంటామన్నారు. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యం ఉంటే.. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి, కుటుంబానికి న్యాయం చేస్తామని.. చీరాల ఘటనలో కూడా నిందితుడిని 36 గంటల్లో పట్టుకున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.