48
ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి గ్రామ శివారు అడివిలో బోగత జలపాతం పొంగిపొర్లాడుతుంది. తెలంగాణ – ఛత్తీస్‌గఢ్‌లోని అడవి ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు పెనుగోలు అడవి ప్రాంతంలోని కొండా కోనల నుంచి నీళ్లు జాలువారుతున్నాయి. వాగులు, వంకల నుంచి నీరు ప్రవహిస్తూ బోగత జలపాతం హోయలొలుకుతోంది. అడవి ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి 50 అడుగుల ఎత్తుతో జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో బోగతను చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.