31
92 వార్డ్ ZPH స్కూల్ చకలిగెడ్డ గోపాలపట్నం వద్ద భారీ వృక్షం విరిగిపోయి రోడ్ కి అడ్డంగా పడిపోయింది. ఈ సందర్భంగా స్థానిక నాయకులు విశాఖ పశ్చిమ శాసనసభ్యులు గణబాబు దృష్టికి తీసుకెళ్లగా.. సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. వెంటనే అధికారులకు సమాచారం అందించి.. పడిన వృక్షన్ని తొలగించాలని ఆదేశించారు. రోడ్ మార్గాన్ని క్లియర్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, రైతు బజార్ వచ్చే కొనుగోలుదారులు గణబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.