Tuesday, April 21, 2026
Home » తల్లిదండ్రులకు కీలక సూచన చేసిన సినీ నటుడు సాయి ధరమ్‌తేజ్‌.. అదేమిటంటే..? – News Watch

తల్లిదండ్రులకు కీలక సూచన చేసిన సినీ నటుడు సాయి ధరమ్‌తేజ్‌.. అదేమిటంటే..? – News Watch

by News Watch
0 comment
తల్లిదండ్రులకు కీలక సూచన చేసిన సినీ నటుడు సాయి ధరమ్‌తేజ్‌.. అదేమిటంటే..?


ప్రముఖ నటుడు, మెగా మేనెల్లుడు సాయి ధరమ్‌తేజ్‌ చిన్నారుల తల్లిదండ్రులకు కీలక సూచన చేశారు. సామాజిక మాధ్యమాలు వినియోగించే వారి కోసం జరుగుతున్న కొన్ని ఇబ్బందికర పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఆయ న ఈ మేరకు తల్లిదండ్రులకు ఎక్స్‌ వేదికగా విజ్ఞప్తి చేశారు. పిల్లలు ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందు అప్రమత్తంగా వ్యవహరించాలని పేరెంట్స్‌కు సూచించారు. నియంత్రించలేనంతగా సామాజిక మాధ్యమాలు కూర్రంగా, భయానకంగా మారిపోయాయని, కొన్ని మానవ మృగాలు నుంచి పిల్లలను రక్షించుకోవాలని పేరెంట్స్‌ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్టు పేర్కొన్నారు. పిల్లలు ఫోటోలు, వీడియోలను నెట్టింట్ పోస్ట్ చేసేటప్పుడు కాస్త ఆలోచించాలి.

సోషల్ మీడియా మృగాలకు తల్లిదండ్రుల బాధ అర్థం కాదు, కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలంటూ తేజ్‌ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. కొంత మంది యూట్యూబర్‌లు పిల్లల ఫొటోలను మార్ఫింగ్‌ చేస్తూనో, పిల్లలతో కలిసి పేరెంట్స్‌ చేసిన వీడియోలపైనో అవమానకరంగా కామెంట్‌లు ప్రదర్శించబడుతున్నాయి, ఈ నేపథ్యంలోనే సాయి ధరమ్‌తేజ్‌ ఈ కామెంట్‌ చేసినట్టు. సామాజిక మాధ్యమాలు వినియోగంపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు తేజ్‌ ఈ మేరకు ట్వీట్‌లు చేస్తున్నారు. చిన్నారుల భద్రత గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ట్వీట్‌ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్ ఖాతాలకు ఆయన ట్యాట్‌ చేశారు. తేజ్‌ ట్వీట్‌పై సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. పిల్లల భద్రత తమ ప్రభుత్వ లక్ష్యాల్లో ఒకటని, ఈ నియంత్రణ తమ దృష్టికి తెచ్చినందుకు దన్యవాదాలను తెలియజేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch