హైదరాబాద్, ఈవార్తలు: రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డి భేటీని పరిశీలించారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో వీరిద్దరు భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి, సీనియర్ అధికారులు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు, మంత్రులు కందుల దుర్గేష్, సత్యప్రసాద్, బీసీ జనార్ధన్ రెడ్డి, సీఎస్, మరో ఇద్దరు అధికారులు.
రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ముఖ్యంగా తెలంగాణ పలు డిమాండ్లను ఏపీ ముందు.. ఏపీ కూడా పలు డిమాండ్లను తెలంగాణ ముందు ఉంచనున్నది. ఇరు రాష్ట్రాలు సమన్వయంతో, రెండు రాష్ట్రాల పురోభివృద్ధికి దోహదం చేసేలా చర్చలు కొనసాగుతున్నాయి.