6
ముద్ర,హైదరాబాద్:-సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ స్కూల్లో రిటైర్డ్ ఆర్చ్ బిషప్ తుమ్మబాల భౌతికకాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. సమాజ నిర్మాణంలో తూముంబల ఎనలేని సేవలందించారు. ప్రజలకు శాంతి, మత సామరస్యం, విద్యను అందించారు. వ్యక్తిగతంగా తనకు ప్రత్యేకమైన అనుబంధం.కాగా.. 2019 ఎంపీ ఎన్నికల్లోనూ, 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమను మంచి మనసుతో ఆశీర్వదించారని చెప్పారు. వారి ఆశీస్సులతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. ఆయన మరణం అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చి ఉంది. వారి సేవలను కొనియాడుతూ.. వారి సందేశం స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. ఆయన సేవలు మరవలేనివి అన్నారు. ఇన్నిరోజులు ఆయన ఇచ్చిన సందేశాన్ని అందరూ పాటించి ముందుకు సాగాలని సీఎం అన్నారు.