5

ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఏపీలో వైసీపీ నేత దారుణ హత్యకు పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఈ ఘటన జరిగింది. మదనపల్లె పట్టణం శ్రీవారినగర్‌లో వైసీపీ నాయకుడు పుంగనూరు శేషాద్రి దారుణ హత్యకు పాల్పడ్డారు.శేషాద్రి ఇంట్లోకి దూరిన దుండగులు కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. దాంతో ఆయన రక్తపుమడుగులో కుప్పకూలారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. దుండగులు పరారీ కాగా.. వారిని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.