6

ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీని ఇండియా కూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తెలంగాణలో తాము 12 లోక్ సభ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో అధికారంలోకి వచ్చాక తెలంగాణకు 4 కేంద్రమంత్రి పదవులు అడుగుతామని చెప్పారు.
ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం బీజేపీ మూడోసారి అధికారంలోకి రానుంది. దాదాపు అన్ని సర్వేలు కూడా ఎన్డీయే కూటమి అధికారంలోకి రానుందని వెల్లడించాయి. బీజేపీ 350 సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేస్తున్నారు. ఇక తెలంగాణలో బీజేపీకి 7 నుంచి 12, కాంగ్రెస్ పార్టీకి 5 నుంచి 10 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.