Thursday, February 26, 2026
Home » ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలి.. కేంద్ర ఆర్థిక మంత్రిని కోరిన సీఎం చంద్రబాబు – News Watch

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలి.. కేంద్ర ఆర్థిక మంత్రిని కోరిన సీఎం చంద్రబాబు – News Watch

by News Watch
0 comment
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలి.. కేంద్ర ఆర్థిక మంత్రిని కోరిన సీఎం చంద్రబాబు


ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజైన శుక్రవారం ముఖ్య నాయకులను ఆయన కలిసి ఒక వినతి పత్రాలను సమర్పించారు. గురువారం ప్రధాన మోడీతోపాటు ఇతర కేంద్ర మంత్రులను చంద్రబాబు నాయుడు.. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ను శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను కేంద్ర మంత్రికి వివరించారు. గత ప్రభుత్వ దుష్పరిపాలన కారణంగా వైసీపీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. రాష్ట్ర అవసరాలపై మెమొరాండాన్ని ఈ సందర్భంగా ఆర్థిక మంత్రికి సమర్పించారు. ఏపీకి నిధులు కేటాయింపులు ఎందుకు పెంచాలో అందులో ఆయన వివరించారు. సుమారు గంటపాటు ఆర్థికశాఖ మంత్రితో సీఎం చంద్రబాబు నాయుడు కీలక అంశాలపై చర్చించారు. అప్పుల భారంతో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని, అభివృద్ధి దిశగా పయనించడానికి అవసరమైన సహకారాన్ని అందించాలని.

పలు ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు అమరావతి, ఇతర వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించాలని ఆయన పేర్కొన్నారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడి తప్పిందని ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు. 2023 – 24 లో రాష్ట్ర అప్పులు జిఎస్డిపిలో 33.32 ఎగ్జిబిషన్ చేరుకున్నాయని. 2019 – 20 లో అది 31.2 ఉందని సీఎం గుర్తు చేశారు. పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలను పరిష్కరించాలని నిర్మలా సీతారామన్ ను ఈ సందర్భంగా చంద్రబాబు నిర్ణయించారు. సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. చాలావరకు కేంద్రం నుంచి ఆర్థిక భరోసా అందజేయబడింది. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన సహాయ, సహకారాలను అందిస్తామన్న భరోసాను ఆమె కల్పించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch