
ముద్ర,హైదరాబాద్:-తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆకలినైనా భరిస్తాం కానీ స్వేచ్ఛను హరిస్తే ఊరుకోమని. ప్రాంతేతరులు ద్రోహం చేస్తే పొలిమేర వరకు తరిమికొడతాం అని అన్నారు. ప్రజాభవన్‌లో ప్రతీ మంగళ, శుక్రవారాల్లో ప్రజాదర్బార్ ఉన్నట్లు చెప్పారు. తాము స్వర్ణజ్ఞానులం అన్న భ్రమ తమకు లేదని మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురైందని అన్నారు. సామజిక న్యాయం మేడిపండు చందంగా మారిందని.
అధికారిక ఉత్తర్వులు, వాహనాల పేర్లకు TS బదులు TGగా మార్చినట్లు చెప్పారు. ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తూనే, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో రాజీలేని కృషి చేస్తున్నామని అన్నారు. మొదటితేదీన ఉద్యోగులకు, పెన్షన్‌దారులకు వేతనాలు ఇస్తున్నామని చెప్పారు. మూసి సుందరీకరణ పథకం ద్వారా రూ. వెయ్యి కోట్లతో పరీవాహిక ప్రాంతం ఉపాధి కల్పన జోన్.. త్వరితగతిన రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తికి ప్రయత్నం జరిగింది. రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచినట్లు చెప్పారు. అలాగే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 70 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించినట్లు తెలియజేసారు. ఇచ్చినట్లు తెలిపారు. పేదల కోసం నాలుగున్నర లక్షల ఇళ్లు కోసం రూ.22,500 కోట్లను అందించినట్లు చెప్పారు.