రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రాన్ని రావణకాష్టకం, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద అన్యాయంగా కేసులు పెట్టి నిర్బంధించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి నాయకులపై దాడులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాల్వాయి గేటు వద్ద పోలింగ్ రోజు అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో రామకృష్ణారెడ్డి ఈవిఎం పగలగొట్టారని, కానీ హత్యాయత్నం చేశాడంటూ కేసులను నమోదు చేయడం దారుణం అన్నారు. టిడిపి రిగ్గింగ్ చేస్తుంటే ఎమ్మెల్యే అడ్డుకున్నారని, ఆయనపై పది రోజులు తర్వాత హత్యాయత్నం చేశాడంటూ కేసు నమోదు చేయడం దారుణం అన్నారు. మరి ఫిట్ రిపోర్టులో ఈ విషయం ఎందుకు రాదన్నారు. వరుసగా నాలుగు సార్లు గెలిచిన వ్యక్తిపై ఈ తరహాలో వ్యవహరించడం దారుణమన్నారు. తప్పుడు కేసుల్లో నిర్బంధించడం ఎంతవరకు సమంజసమని జగన్ ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదేవిధంగా దాడులు చేయడం, కేసులు నమోదు చేయడం. అత్యంత దారుణంగా ఆస్తులను ధ్వంసం చేసి, దొంగ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాపాలు వేగంగా పండుతున్నాయని, త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని.
ఈ తరహా దాడులను ఇప్పటికైనా ఆపాలని, లేకపోతే అంతే స్థాయిలో రియాక్షన్ ఉంటుందన్నారు జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదన్న ఏకైక కారణంతో ఏకంగా ప్రజల ఆస్తులను ధ్వంసం, కేసులు పెట్టి వేధిస్తున్నారని దొంగ. రాష్ట్రంలో దారుణమైన పాలన సాగుతుందని. గడచిన ఐదేళ్ల వైసిపి పాలనలో అప్పుడు జగన్ ఏం చేశాడని ఈ సందర్భంగా జగన్ ప్రశ్నించారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా.. అర్హతను ప్రామాణికంగా తీసుకొని మంచిని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేశామన్నారు. కానీ ప్రస్తుతం టిడిపికి ఓటు వేయలేదు అన్న కారణంతో ఆస్తులు ధ్వంసం ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి నాయకులు కొట్టి కేసులు పెడుతున్నారు. వైయస్సార్ విగ్రహాలను ధ్వంసం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. శశిపాలుడు పాపాలు పండినట్లు చంద్రబాబు నాయుడు పాపాలు పండుతున్నాయి అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేసి ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకోవాలన్నారు.
ప్రజలు ఎందుకు ఓటు వేశారు చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబుకు సూచించారు. ప్రజలకు మంచి చేసి వైసిపి ఓడిపోయిందని, చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు ఓట్లేసారు. ప్రజలకు హామీలను అమలు చేయడంపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి సూచించారు. సంక్షేమ పథకాలను అమలు చేయకుండా ఈ తరహా కక్షపూర్త రాజకీయాలు చేయడం దేనికని ప్రశ్నించారు. ప్రజలకు హామీలను అమలు చేయడంపై దృష్టి సారించాలని, హామీలను అమలు చేయకుండా భయాందోళనలను క్రియేట్ చేసే ప్రయత్నం ఇచ్చిన.