Thursday, March 19, 2026
Home » మంగ‌ళగిరిలో లోకేశ్, పిఠాపురంలో ప‌వ‌న్‌, తెనాలిలో నాదెండ్ల మ‌నోహర్ ముందంజ‌ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

మంగ‌ళగిరిలో లోకేశ్, పిఠాపురంలో ప‌వ‌న్‌, తెనాలిలో నాదెండ్ల మ‌నోహర్ ముందంజ‌ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 మంగ‌ళగిరిలో లోకేశ్, పిఠాపురంలో ప‌వ‌న్‌, తెనాలిలో నాదెండ్ల మ‌నోహర్ ముందంజ‌ - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • మంగ‌ళగిరిలో లోకేశ్ ఆధిక్యం
  • పిఠాపురంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ముందంజ‌
  • తెనాలిలో జనసేన నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ ఆధిక్యం

ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. పోస్ట‌ల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు. అటు రాష్ట్రంవ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేనాని ముందంజ‌లో ఉన్నారు. 4వేల’కు పైగా ఓట్ల‌ లీడ్‌తో ప‌వ‌న్ దూసుకుపోతున్నారు. వైసీపీ అభ్యర్థి వంగా గీత వెనుకంజలో ఉన్నారు. టీడీపీ 12, జనసేన 3 అసెంబ్లీ నియోజక‌వర్గాల్లో లీడ్‌లో ఉన్నాయి. అలాగే తెనాలిలో జ‌న‌సేన నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు.

నారా లోకేష్, పవన్ కళ్యాణ్, మంగళగిరి, పిఠాపురం, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch