
ముద్ర,హైదరాబాద్:- హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకు వచ్చిన ఓ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. తెలంగాణ పోలీస్ అకాడమీ సమీపంలో ఆగి ఉన్న రెండు కార్లను వేగంగా ఢీకొట్టింది. ఒక్కసారిగా వారి పైకి ట్యాంకర్ దూసుకువెళ్లడంతో యువతి, యువకుడు మృతి చెందారు. ఔటర్ రింగు రోడ్డులో కార్లు ఆపి ఫొటోలు దిగుతున్న సమయంలో జరిగిన ప్రమాదంలో నార్సింగి పోలీసులు గుర్తించారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.
మృతి చెందిన వారిని మనీషా, చంద్రతేజ గా పేర్కొన్నారు. ట్యాంకర్ డ్రైవర్ ప్రశాంత్ కుమార్ కృష్ణాజిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ప్రశాంత్ తాగి డ్రైవ్ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు.వారాంతం కావడంతో నలుగురు స్నేహితులు రెండు కార్లలో ఎయిర్ పోర్ట్ సమీపంలోని ఫుడ్ కోర్టుకు వెళ్లారు. తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మిగిలిన స్నేహితులకు తృటిలో ప్రమాదం తప్పింది.