Friday, March 13, 2026
Home » పాత పద్ధతిలోనే డ్రైవింగ్ లైసెన్స్ జారీ.. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

పాత పద్ధతిలోనే డ్రైవింగ్ లైసెన్స్ జారీ.. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 పాత పద్ధతిలోనే డ్రైవింగ్ లైసెన్స్ జారీ.. - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,తెలంగాణ:-పాత పద్దతిలోనే డ్రైవింగ్‌ లైనెస్సులు యథావిధిగా రవాణాశాఖ కార్యాలయాల్లోనే జారీ కానున్నాయి. డ్రైవింగ్‌ లైసెన్సింగ్‌ మరింత సరళతరం ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇకపై కూడా డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం మొదట లెర్నర్‌ లైసెన్స్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకుని రాత పరీక్షలకు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత నిర్ణీత గడువులోగా లైసెన్స్‌ కోసం డ్రైవింగ్‌లో పాల్గొని అర్హత సాధిస్తేనే లైసెన్స్‌ అందించబడుతుంది.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అయితే డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆయా డ్రైవింగ్‌ స్కూళ్లు ఆర్టీఏ వద్ద రిజిస్ట్రిషేన్‌చేసుకుని లైసెన్స్‌లు తీసుకోవాలి. ఆయా స్కూల్‌లలో ముందుగా దరఖాస్తు చేసుకున్న పాఠశాలల్లో ఉత్తీర్ణత సాధిస్తే ఆ పత్రంతో ఆర్టీఏ దరఖాస్తు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. జూన్ 1 నుంచి అమలులోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం దురుసుగా బండి నడిపితే రూ.1000 నుంచి రూ.2000 వరకు జరిమానా, మైనర్లు వాహనం నడుపుతూ రూ.25 వేల జరిమానాతోపాటు వాహన యజమాని డ్రైవింగ్‌ రిజిస్ట్రేషన్‌ కార్డును కూడా రద్దు చేస్తారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch