4

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు పార్టీలు వెల్లడించాయి. 9వ తేదీన ముఖ్యమంత్రి అమరావతిలో ఆయన నాలుగోసారిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిసింది. ఇప్పటికే ముహూర్తాన్ని చూసుకుని సమయాన్ని నిర్ణయిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.
ఉప ముఖ్యమంత్రిగా…
తాను నిర్మించ తలపెట్టిన రాజధాని అమరావతిలోనే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీకి స్వింగ్ అయినట్లు కనిపిస్తే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు ఉపముఖ్యమంత్రిగా కల్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.