Thursday, March 19, 2026
Home » నటి హేమ అరెస్ట్… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

నటి హేమ అరెస్ట్… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 నటి హేమ అరెస్ట్... - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • రేవ్ పార్టీ కేసులో అదుపులోకి తీసుకున్న బెంగళూరు పోలీసులు

బెంగళూరు డ్రస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తెలుగు నటి హేమ అరెస్టు అయ్యారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ కూడా పాల్గొన్నారని కర్ణాటక పోలీసులు తెలిపిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ పరీక్షల్లో ఆమె మాదకద్రవ్యాలు తీసుకున్నట్లుగా కూడా రిపోర్టు వచ్చింది.

బెంగుళూరు రేవ్ పార్టీ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మొత్తం 100 మందికి బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 86 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఇందులో ఎక్కువగా తెలుగువారు, టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటినటులు ఉండటంతో సినీ పరిశ్రమను షేక్ చేసింది. ఈ కేసులో ప్రముఖ నటి హేమ పేరు మారుమోగింది. బెంగుళూరు రేవు పార్టీలో నటి హేమించేట్లు తెలుపగా.. అక్కడ తను లేనంటూ బుకాయించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు ఆధారాలతో సహా బయటపెట్టడంతో హేమ ప్లాన్ బెడిసికొట్టింది. ఇక రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడంతో ఆమెకు పోలీసులు నోటీసులు పంపించారు. మే 27న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పంపించగా.. గైర్హాజయ్యింది. తాజాగా నటి హేమకు బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నటి హేమను బెంగుళూరు సీసీబీ పోలీసులు విచారిస్తున్నారు. గతంలో విచారణకు హాజరుకావాలని రెండు సార్లు నోటీసులు పంపగా వివిధ కారణాలతో రెండు సార్లు విచారణకు హాజరుకాలేదు. ఇక ఇప్పుడు థర్డ్ నోటీస్ కు పోలీసులు హాజరుకాగా.. సోమవారం ఉదయం బెంగళూరులో హేమను అరెస్ట్ చేశారు. సోమవారం బెంగళూరు సీసీబీ పోలీసులు నటి హేమను అదుపులోకి తీసుకోగా.. హేమను మంగళవారం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch