7

ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఏపీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ బోణీ కొట్టింది. అనపర్తిలో బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. టీడీపీ నేతగా ఉన్న నల్లమిల్లికి ఆ పార్టీ నుంచి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచారు.మరోవైపు సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ప్రభంజనం కొనసాగుతోంది. 160కి పైగా స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. అటు అధికార వైసీపీ కేవలం 17 చోట్ల ముందంజలో ఉంది. ఇప్పటికే టీడీపీ మూడు చోట్ల విజయకేతనం ఎగురవేసింది. రామండ్రి అర్బన్, రూరల్‌తో పాటు పాలకొల్లులో టీడీపీ విజయఢంకా మోగించింది.