
ముద్ర,తెలంగాణ:- తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు బ్యాలెట్స్ లెక్కింపు కొనసాగుతోంది… కాంగ్రెస్ 8, బిజెపి 8, ఎఐఎం 1 ఒక స్థానంలో అధికారంలో ఉన్నాయి.
లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు గాను బీజేపీ 8, కాంగ్రెస్ చెరో 7 స్థానాల్లో, మజ్లిస్ , బిఆర్ ఎస్ లు ఒక్కొ స్థానంలో ముందంజలో ఉన్నాయి. హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి మజ్లిస్ పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అధికారంలో నిలిచారు.
అధీక్యంలో ఉన్న బిజెపి అభ్యర్ధులు
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (సికింద్రాబాద్), ఈటల రాజేందర్ (మల్కాజిగిరి), గోడం నగేశ్ (ఆదిలాబాద్), బండి సంజయ్ (కరీంనగర్), ధర్మపురి అరవింద్ (నిజామాబాద్), కొండా విశ్వేశ్వర్ రెడ్డి (చేవెళ్ల), డీకే అరుణ (మహబూబ్ నగర్), భరత్ ప్రసాద్ (నగర్ కర్నూల్) ) ఆధిక్యంలో ఉన్నారు.
అధికారంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్ధులు
ఖమ్మం లోక్‌సభ స్థానంలో రఘురామిరెడ్డి (కాంగ్రెస్) 55,564 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. గడ్డం వంశీ కృష్ణ (పెద్దపల్లి), సురేశ్ షెట్కార్ (జహీరాబాద్), చామల కిరణ్ కుమార్ రెడ్డి (భువనగిరి), బలరాం నాయక్ (మహబూబాబాద్), రఘువీర్ రెడ్డి (నల్‌గొండ), కావ్య కడియం (వరంగల్) కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతున్నారు.
హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం) ఆధిక్యం కనబరుస్తున్నారు. భారాస మెదక్ స్థానంలో అధికారం ఉంది. ఆ పార్టీ తరపున వెంకట్రామిరెడ్డి బరిలో ఉన్నారు.
కరీంనగర్ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్,మల్కాజ్‌గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అధికారం..
మల్కాజిగిరి పార్లమెంట్: కౌంటింగ్ ప్రారంభం ఈటలకు 18,546 ఫస్ట్ రౌండ్ లో లీడ్…
మొదటి రౌండ్‌లో వరంగల్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ 242 ఆధిక్యం
తెలంగాణలో బీజేపీ కీలక నేతలు కిషన్ రెడ్డి,
బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్,
డీకే అరుణ తీసుకున్న ముందంజలో ఉన్నారు.
చేవెళ్ల పార్లమెంట్ ఓటింగ్ కౌంటింగ్ అప్‌డేట్స్ 1వ, రౌండ్ ముగిసే సమయానికి..! అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జ్ఞానేశ్వర్:- 818 , బీజేపీ పార్టీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి:- 3773 , కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి:- 3214 ముందంజలో l బీజేపీ పార్టీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి559 ఆధిక్యం
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం లో కాంగ్రెస్ అధికారం .. మొదటి రౌండ్ పూర్తి అయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 8404ఓట్ల అధికారం నల్లగొండ లోక్ సభ తొలి రౌండ్. మొత్తం ఓట్లు : 64862. కాంగ్రెస్ : 37984. బిఆరెస్ : 11796. బీజేపీ : 10970.
కాంగ్రెస్ అధిక్యం : 26188.
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లో దరఖాస్తు , హోమ్ ఓటింగ్ లో కాంగ్రెస్ పోరిక బలరాం నాయక్ 1907 ఓట్లు అధికారం.
కాంగ్రెస్ అభ్యర్థులు…
నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి, ఖమ్మం నుంచి రఘురామిరెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ ఆధిక్యంలో ఉన్నారు. పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్, నాగర్ కర్నూలు, భువనగిరి నియోజకవర్గాలలో కాంగ్రెస్ ముందంజలో పోటీ పోటాపోటీ.
బీజేపీ అభ్యర్థులు…
వరంగల్ నుంచి ఆరూరి రమేశ్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, మల్కాజ్‌గిరి నుంచి ఈటల రాజేందర్, ఆదిలాబాద్ నుంచి గోడం నగేశ్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ ముందంజలో ఉన్నారు.