Thursday, March 12, 2026
Home » స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా – ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా – ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా - ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర/షాద్ నగర్- స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమస్యలను పరిష్కరించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం ఫరూక్‌నగర్ మండల పరిధిలోని ఎలికట్ట గ్రామ సమీపంలో ఉన్న శ్రీ భవాని మాత అమ్మవారి దేవాలయంలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్సీగా విజయం సాధించి మొదటిసారిగా దేవాలయానికి వచ్చిన సందర్భంగా ఆలయ అర్చకులు పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనపై నమ్మకం పెట్టి ఓట్లు వేసిన ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, మున్సిపల్ చైర్మన్లకు, కౌన్సిలర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధుల సమస్యల శాసనమండలిలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది. ప్రజా ప్రతినిధుల సమస్యలపై నిరంతరం పోరాడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలియజేసింది. ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కడంపల్లి శ్రీనివాస్ గౌడ్, శివ చారితోపాటు కార్యకర్తలు నాయకులు ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch