3

ముద్ర,ఆంధ్రప్రదేశ్:-తాడేపల్లిలోని స్పెషల్ ఇన్విస్టిగేషన్ కార్యాలయాన్ని అధికారులు సీజ్ చేశారు. సిట్ ఆఫీస్ కు తాళాలు వేశారు. సిట్ ఎలాంటి పత్రాలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు కానీ మాయం కాకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ మేరకు సిట్ కార్యాలయానికి తాళాలు వేశారు. గతంలో చంద్రబాబును స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో, మార్గదర్శి కేసులో, హెరిటేజ్ వంటి సంస్థలపై కేసులు నమోదు చేసిన సిట్ అధికారులు కొన్ని కీలక పత్రాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని భావించి టీడీపీ నేతలు ముందుగానే గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ప్రకారం సిట్ ఆఫీస్ కు తాళాలు వేశారు.