Monday, March 16, 2026
Home » ఆ యాప్స్ లో ఇకపై కరెంటు బిల్లులు చెల్లించలేరు.. ఎందుకంటే ఇది కారణం..! – News Watch

ఆ యాప్స్ లో ఇకపై కరెంటు బిల్లులు చెల్లించలేరు.. ఎందుకంటే ఇది కారణం..! – News Watch

by News Watch
0 comment
ఆ యాప్స్ లో ఇకపై కరెంటు బిల్లులు చెల్లించలేరు.. ఎందుకంటే ఇది కారణం..!


విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్, పేటీఎం వంటి పేమెంట్స్ యాప్‌లను వినియోగించే వినియోగదారులకు బ్యాడ్ న్యూస్. ఇకపై ఈ యాప్స్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించే అవకాశం లేకుండా పోయింది. ఈ విషయం చాలామందికి తెలియదు. విద్యుత్ బిల్లులు చెల్లింపులను ఆయా యాప్‌లు నిలిపివేయడమే దీనికి కారణం. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల తరహాలోనే ఈ సేవలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) సోమవారం ఈ మేరకు ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ (పీపీ ఈపీడీసీఎల్) కూడా తమ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ లోనే బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఆర్.బి.ఐ మార్గదర్శకాలను అనుసరించి జూలై ఒకటో తేదీ నుంచి ఆయా చెల్లింపు సంస్థలు విద్యుత్ బిల్లుల చెల్లింపులను నిలిపివేశాయని రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు వెల్లడించాయి. ఈ రెండు విద్యుత్ పంపిణీలు మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని ఇతర డిస్కమ్‌లైన టీజీఎన్పీడీసీఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీసిపిడిసిఎల్ పరిధిలోని వినియోగదారులు కూడా బిల్లులు చెల్లించాలని ప్రయత్నించినప్పుడు భారత బిల్ పేమెంట్ సిస్టమ్‌కు రిజిస్టర్ కాలేదని చూపుతోంది. దీనివల్ల పెద్ద సంఖ్యలో ప్రజలపై ప్రభావం పడనుంది. దీంతో ఆయా విద్యుత్ పంపిణీ సంస్థల ద్వారా వినియోగదారుల డిస్కమ్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆర్బిఐ ఏం చెబుతోంది అంటే

ఈ వ్యవహారంపై ఆర్బిఐ కూడా కీలక ప్రకటన చేసింది. బిల్లు చెల్లింపుల్లో సమర్థత భద్రతకు పెద్దపీట వేసేందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. బిల్లు చెల్లింపులు అన్ని భారత్ బిల్ పేమెంట్ సిస్టం (బీబీపీఎస్) ద్వారా జరగాలని నిర్ణయించింది. జూలై ఒకటో తేదీ నుంచి కొత్త నిబంధనలను అందించింది. భాగంగా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ను బిల్లర్లు ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ బ్యాంకులకు సంబంధించి హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు ఈ పేమెంట్ సిస్టమ్‌ను ఆక్టివేట్ చేసుకోలేదు. దీనితో ఫోన్ పే, క్రెడ్ వంటి కస్టమర్ల క్రెడిట్ కార్డుల బిల్లులను ప్రాసెస్ చేయలేవు. దీనివల్ల యాప్స్ లో క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపులకు వీలుపడదు. ఇప్పుడు విద్యుత్ బిల్లుల చెల్లింపుల విషయంలోనూ అదే జరిగినట్లు ఆర్బిఐ చెబుతోంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch