Saturday, June 13, 2026
Home » నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలి… బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు బడుగు శ్రీకాంత్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలి… బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు బడుగు శ్రీకాంత్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలి... బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు బడుగు శ్రీకాంత్ - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



భూదాన్ పోచంపల్లి, ముద్ర:- తెలంగాణ రాష్ట్రంలో యువత ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు బడుగు శ్రీకాంత్ అన్నారు. సోమవారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రాన్ని తహశీల్దార్ కార్యాలయం వద్ద బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి కి ప్రతిపత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బడుగు శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-2,3 పోస్టులను పెంచి నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. అదేవిధంగా డీఎస్సీ పరీక్షల తేదీలను వాయిదా వేసి, మెగా డీఎస్సీ ని ప్రకటించాలన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గోళనుకొండ ప్రభాకర్, గంగపురం శ్రవణ్ కుమార్, వంగూరి సిద్దు, ఇట్టామోని బాలు, చిలువేరు నరేందర్, గడ్డం మహేష్, సాయికిరణ్ నిర్వహించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch