Thursday, February 26, 2026
Home » నేడు హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ విచారణ …. – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

నేడు హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ విచారణ …. – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 నేడు హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ విచారణ .... - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:-మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈరోజు ఆయన ముందస్తు బెయిల్ విచారణకు వస్తే ఆయన తప్పించుకుని పోకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మఫ్టీలో ఆయన మకాం వేచి ఉన్న ప్రాంతంలో పోలీసులు పహారా కాస్తున్నారు.

పాల్వాయి గేటు పోలింగ్ ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో హైకోర్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈ నెల 5వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేయలేదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఈవీఎం ధ్వంసం జరిగిన కేసుతో పాటు మరో మూడు హత్యాయత్నం కేసులు ఉన్నాయి. మరి నేడు కోర్టు తీర్పు ఎలా ఉండనుందన్నది చూడాల్సి ఉంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch