Friday, February 27, 2026
Home » Ponnam Prabhakar – పర్యవరణ దినోత్సవం రోజు ముఖ్య విజ్ఞప్తి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

Ponnam Prabhakar – పర్యవరణ దినోత్సవం రోజు ముఖ్య విజ్ఞప్తి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 Ponnam Prabhakar - పర్యవరణ దినోత్సవం రోజు ముఖ్య విజ్ఞప్తి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్... - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,తెలంగాణ:-ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తన నివాస ఆవరణలో మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రతి పౌరుడు.. రాబోయే తరాన్ని, పుట్టబోయే పిల్లలను ఆరోగ్యంగా రక్షించుకోవాలన్న మనం పీల్చే శ్వాస స్వచ్ఛంగా రావాలన్న ప్రతి పౌరుడు విధిగా మొక్కలు నాటి వృక్షంగా మారే విధంగా బాధ్యత వహించాలి.. రాబోయే సమాజాన్ని కాపాడడంలో మనమంతా భాగస్వామ్యం కావాలి.. పిల్లలకు ప్రతి రోజు మొక్కలకు నీళ్ళు పోసే విధంగా అలవాటు చేయాలి మంత్రి పొన్నం ప్రభాకర్.

అలాగే, మనం మన పర్యావరణాన్ని రక్షించుకుంటే పర్యావరణం మనల్ని రక్షిస్తుంది అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. పర్యావరణాన్ని చెడగొట్టే విధంగా చెట్లు కత్తిరించడం, మొక్కలు నాటకపోవడం, ప్లాస్టిక్ వాడడం వల్ల ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది.. ఇప్పటికే కాలుష్యం పెరిగి క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోవడంతో మరణాల సంఖ్య రోజుకు పెరిగిపోతోంది. తెలంగాణ ప్రతి బిడ్డ ఈ రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపి పర్యావరణాన్ని రక్షించుకొని కలుషరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అని పొన్నం ప్రభాకర్ చెప్పారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch