అమరావతి, ఈవార్తలు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. జూలై 4న ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో ఆయన సమావేశం కానున్నారు. విభజన హామీలు, ఇతర ఆర్థిక వారితో చర్చించిన సమాచారం. కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టన పూర్తి రాష్ట్రానికి సంబంధించి పలు ప్రతిపాదనలు, సంబంధిత వారితో చర్చలు జరిగాయి. కేంద్ర బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని కోరుకున్న ఏపీ సమాచారం. మరోవైపు, విభజన హామీలు, పెండింగ్ బకాయిలు, ఏపీకి అందాల్సిన నిధులు త్వరగా అందించాలని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను ఆయన కోరే అవకాశం ఉంది. ఈ భేటీపై స్పష్టత వస్తే.. దానికి అనుగుణంగా ఏపీ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపట్టాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఏపీ సీఎం హోదాలో చంద్రబాబు తొలిసారి ఢిల్లీ వెళ్లనున్నారు. దీనితో ఆయనప రాజకీయవర్గాలు, ప్రజల్లో ఆసక్తి చూపారు. ఏపీకి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? రాష్ట్రానికి ఎన్ని నిధులు వస్తాయి? అన్న చర్చ నడుస్తోంది. ఇప్పటికే బీహార్‌కు ప్రత్యేక హోదా కోరుతూ ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ డిమాండ్ చేయగా, మరి.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని చంద్రబాబు డిమాండ్ చేస్తారా? అని చర్చిస్తున్నారు. ప్రత్యేక హోదా సాధిస్తే రాష్ట్రానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరనుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి.