
ముద్ర.వీపనగండ్ల:- వీపనగండ్ల గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు నీట్ పరీక్షల్లో తమ ప్రతిభను చాటుకున్నారు. వీపనగండ్ల గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జోళ్లు గంగన్న శ్యామల కుమారుడు అఖిల్ 720 మార్కులకు గాను 645 మార్కులు, మేడిపల్లి నాగేశ్వర్ రెడ్డి శ్వేత కుమార్తె యామిని రెడ్డి 568 మార్కులు, మునిగొండ గోపి మాధవి కుమార్తె అఖిల 444 మార్కులు సాధించి ఎంబిఎస్‌లో సీటు పొందేందుకు అర్హత సాధించారు. విద్యార్థులు నీట్‌లో మంచి మార్కులతో ప్రతిభ చూపడం ఆనందంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. గత మూడు సంవత్సరాలుగా వీపనగండ్లకు చెందిన చాలా మంది విద్యార్థులు నీట్ పరీక్షలలో ప్రతిభ కనబరచడంతోపాటు రాష్ట్రంలోని పలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో సీట్లు సాధించడం పట్ల గ్రామకారణంగా ఉన్న గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నీట్ లో ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులను ప్రజా ప్రతినిధులుఅధికారుల గ్రామస్తులను అభినందించారు.