తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోని క్యాంపు నూతనంగా గెలిచిన ఎంపీలతో సమావేశం అయ్యారు. కేంద్ర నరేంద్ర మోదీ పార్టీ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో తెలుగుదేశం ఎంపీలు కీలకం కానున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు పలువురికి కేంద్ర మంత్రులకు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. ఢిల్లీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చిన చంద్రబాబు నాయుడు పార్టీ నుంచి గెలిచిన ఎంపీలతో సమావేశమయ్యారు. ఎన్డీఏ సమావేశంలో చర్చించిన అంశాలు, ఎన్డీఏలో చేరడం ద్వారా రాష్ట్రానికి సమకూరనున్న ప్రయోజనాలు, ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత వంటి వాటిపై చంద్రబాబు నాయుడు చర్చించారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి దక్కనున్న మంత్రి పదవులకు సంబంధించి చంద్రబాబు ఎంపీలతో చర్చించినట్లు తెలుస్తోంది. గడచిన ఐదేళ్లు పార్టీకి అండగా ఉన్న కొందరికి మంత్రి పదవులు దక్కాయి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చెప్పినట్లు సమాచారం. రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేద్దామని, బిజెపి ఎన్ని మంత్రి పదవులు ఇస్తే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చెప్పినట్లు. బిజెపికి అవసరం ఉంది కదా అని డిమాండ్ చేసే పరిస్థితి వద్దన్న చంద్రబాబు, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు కేంద్రంతో సంబంధాలు కొనసాగించాలని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఎంపీలకు సూచించారు. ఈ సమావేశానికి నూతనంగా ఎంపికైన ఎంపీలు కలిశెట్టి అప్పలనాయుడు, భరత్, పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాల్లో 21 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇందులో 16 స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు గెలవడం లేదు. తెలుగుదేశం పార్టీకి చెందిన 16 మంది ఎంపీలు నలుగురికి కేంద్ర మంత్రులుగా అవకాశం దక్కనుంది.