Thursday, February 19, 2026
Home » డ్రగ్స్ కంపెనీలో గ్యాస్ లీకేజీ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

డ్రగ్స్ కంపెనీలో గ్యాస్ లీకేజీ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 డ్రగ్స్ కంపెనీలో గ్యాస్ లీకేజీ - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • ముగ్గురు కార్మికులకు అస్వస్థత
  • గుట్టు చప్పుడు కాకుండా ఆసుపత్రికి తరలింపు

భూదాన్ పోచంపల్లి, ముద్ర:- డ్రగ్స్ కంపెనీలో గ్యాస్ లీకేజీ కారణంగా ముగ్గురు కార్మికులు అస్వస్థతకు గురైన సంఘటన భూదాన్ పోచంపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రాన్ని నారాయణగిరి సమీపంలో గల సాయి తేజ డ్రగ్స్ కంపెనీలో బీహార్ రాష్ట్రానికి చెందిన మున్నాలాల్, పరమేశ్వర్, దేవస్థానం నిర్వహిస్తున్నారు. అయితే ఆదివారం సాయంత్రం పని ముగించుకొని నిద్రిస్తుండగా కంపెనీలో గ్యాస్ లీక్ కావడంతో ముగ్గురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కంపెనీ యాజమాన్యం గుట్టు చప్పుడు కాకుండా 108 అంబులెన్స్‌లో కార్మికులను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించింది. మున్నాలా కు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండటంతో 108 సిబ్బంది సిపిఆర్ చేసి ప్రాణాలను కాపాడారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై భాస్కర్ రెడ్డి కంపెనీలోని గ్యాస్ లీక్ అయిన ప్రదేశాన్ని సందర్శించారు. ప్రమాదం ఎలా అక్కడ పనిచేస్తున్న కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ భాస్కర్ రెడ్డి తెలిపారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch