
ముద్ర,తెలంగాణ:- నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల నుంచి నాంపల్లికి ప్రత్యేక బస్సులు నడపాలని టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. ప్రధానంగా రైల్వే స్టేషనులు, బస్టాండ్లు, ఎయిర్‌పోర్టు నుంచి బస్సులు అధిక సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషను నుంచి 9, జేబీఎస్ నుంచి 9, ఎంజీబీఎస్ నుంచి 9, ఈసీఐఎల్ ఎక్స్ రోడ్డు నుంచి 9, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 7 బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఇక సిటీలోని పలు ప్రాంతాల నుంచి 80 ప్రత్యేక బస్సులు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు రాకపోకలు కొనసాగించనున్నాయి. దిల్‌సుఖ్‌నగర్ నుంచి 7, ఎన్జీవోస్ కాలనీ 7, మిథాని 7, ఉప్పల్ 7, చార్మినార్ 5, గొల్కొండ 5, రామ్‌నగర్ 5, రాజేంద్రనగర్ 7, రిసాలబజార్ 5, ఈసీఐఎల్ ఎక్స్ రోడ్స్ 5, పటా 5 5 బస్సులను నడపనున్నారు.