
????హరిత రిసార్ట్ నిర్వహణ లోపాలపై మంత్రి జూపల్లి ఆగ్రహం
????రిసార్ట్ అంత కలియతిరిగిన మంత్రి జూపల్లి.
????హరిత హోటల్ రూమ్స్, హరిత రెస్ట్రారెంట్, పుష్పాంజలి ఆంఫి థియేటర్, ఆడిటోరియం, స్విమింగ్ ఫూల్, టాయిలెట్స్ ను పరిశీలించారు
????హరిత రిసార్ట్ నిర్వహణపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు
???? ఎంట్రెన్స్ దగ్గర గుంతలు పడ్డాయని వాడి మరమ్మతులు చేపట్టాలని, చెత్త చెదారాన్ని తొలగించాలని, ఆహ్లాదకర వాతావరణం ఉండేలా పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
????ఉద్యోగులు, సిబ్బంది ఎంత మంది ఉన్నారు?, వేతనాలు సకాలంలో అందుతున్నాయా లేదా? అని ఆరా తీశారు.
????హరిత రిసార్ట్ నిర్వహణ, వసతుల కల్పనపై పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష జరిగింది
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
????తారామతి బారదారి ప్రైమ్ లొకేషన్ లో విశాలమైన స్థలంలో అనుకున్న స్థాయిలో ఆదాయం రావడం లేదు. దీనికి నిర్వహణలోపమే ప్రధాన కారణం.
????ఆదాయం సరిగా లేదు. గతంలో పట్టించుకునే వారే లేరు. వివిధ స్థాయిలలో సరైన నిర్ణయాలు తీసుకొని పర్యాటక శాఖ ద్వారా హరిత హోటల్స్ నిర్వహణ లోపభూష్టంగా తయారైంది.
????ఎన్నికల కోడ్ కారణంగా పర్యాటక, ఎక్సైజ్ , సాంస్కృతిక శాఖలపై సమీక్షలు చేయలేకపోయాం. ఇప్పటినుంచి ప్రతీ నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటిస్తాం. ప్రభుత్వాలను ప్రైవేట్ తో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుతాం.
????ప్రభుత్వ ఆదాయం పెరగడంతో పాటు పర్యాటకులు, సందర్శకులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై దృష్టి పెడతాం. ఆహ్లాదకరమైన వాతారవణం ఉండేలా హరిత హోటల్స్ ను తీర్చిదిద్దాం. ఇప్పటి నుంచి కఠిన నిర్ణయాలు తీసుకుంటాం. మూడు, నాలుగు నెలల్లో వాటి రూపరేఖలను మారుస్తామని వివరించారు.
????ప్రపంచ పర్యాటకులను ఆకర్షించడమే ప్రధాన ధ్యేయంగా పని చేస్తాం. భవిష్యత్ లో గోల్కొండ ఫెస్టివల్ ఏర్పాటు చర్యలు తీసుకుంటామని అన్నారు.
????ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ రమేష్ నాయుడు, జీఎం (ప్రాజెక్ట్స్) ఉపేందర్ రెడ్డి ఉన్నారు.