మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి షాక్ తగిలింది. తాజాగా ఆయన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. ఎన్నికల సమయంలో జరిగిన ఈవీఎం ద్వంసం కేసుతోపాటు మూడు హత్యాయత్నం కేసులు ఉన్నాయి. ఈ కేసుల నేపథ్యంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన కొద్ది నిమిషాల్లోనే ఆయనను పోలీసులు నరసారావుపేటలో అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే పిన్నెల్లి తన పాస్‌పోర్టును కోర్టులో సమర్పించారు. గడిచిన కొద్దిరోజుల నుంచి ఆయన పల్నాడు ఎస్పీ ఆఫీసులో నేరుగా వెళ్లి సంతకం చేసి వస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో మాచర్ల నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. పోలింగ్ రోజు ఈవీఎంలను ద్వంసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పాల్వాయి గేటు అనే గ్రామంలో పోలింగ్ బూత్‌లో నేరుగా వెళ్లి ఈవీఎంను పగులగొట్రావు. అప్పట్లోనే కేసు నమోదైంది.
ఈ కేసుతోపాటు కేసుల్లో ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌కు కూడా వెళ్లాయి. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈలోగా ఆయన హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. కోర్టుతో పోలీసులు అరెస్ట్ చేయలేదు. బుధవారం బెయిల్ పిటిషన్‌ను కొట్టేయడంతో అరెస్ట్ చేశారు. అయితే, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఇంకా పరారీలోనే ఉన్నట్టు తెలిసింది. ప్రత్యేక బృందాలను నియమించి ఆయన్ను పట్టుకునే ఆలోచనలో పోలీసులు ఉన్నట్లు చెబుతున్నారు. గడిచిన నాలుగు ఎన్నికల్లో విజయం సాధించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తాజా ఎన్నికల్లో ఓటమి చూడడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ వైసీపీ శ్రేణులను షాక్‌కు గురి చేసింది. హైకోర్టులో బెయిల్ ముందస్తుగా లభిస్తుందని భావించిన ఆయనకు నిరాశే ఎదురైంది.