Sunday, March 15, 2026
Home » రామోజీరావు మృతి పట్ల ప్రధాని మోడీ, పవన్ కళ్యాణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

రామోజీరావు మృతి పట్ల ప్రధాని మోడీ, పవన్ కళ్యాణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 రామోజీరావు మృతి పట్ల ప్రధాని మోడీ, పవన్ కళ్యాణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు... - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,సెంట్రల్ డెస్క్:-ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు (88) దివికేగారు. క్రమంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈయన మరణం పట్ల రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

రామోజీరావు అస్తమయంపై ప్రధాని మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. “మీడియాలో రామోజీ సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారు. రామోజీరావు ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారు. ఆయనతో మాట్లాడే అవకాశం నాకు ఎన్నోసార్లు దక్కింది. రామోజీరావు నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. రామోజీరావు అసంఖ్యాక అభిమానులకు నా సానుభూతి” అని మోదీ పోస్ట్ చేశారు.

రామోజీరావు అస్తమయంపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు “బహుముఖ ప్రజ్ఞాశాలి రామోజీ రావు లేరనే వార్త ఆవేదన కలిగించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారు. అక్షరయోధుడు రామోజీ రావు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch