Thursday, April 16, 2026
Home » పేదల పాలిట వరం కల్యాణ లక్ష్మి – ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

పేదల పాలిట వరం కల్యాణ లక్ష్మి – ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 పేదల పాలిట వరం కల్యాణ లక్ష్మి - ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


భూదాన్ పోచంపల్లి, ముద్ర:- పేదింటి ఆడబిడ్డల కుటుంబాలలో కళ్యాణ లక్ష్మి గొప్ప వరంలాగా మారిందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని మండల ప్రజా పరిషత్‌లో 26 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

అనంతరం స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య అదనపు భవనాన్ని పరిశీలించారు. అదేవిధంగా జూలూరు గ్రామంలో ఉప ఆరోగ్య కేంద్ర భవనానికి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయి.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి, జెడ్పిటిసి కోట పుష్పలత మల్లారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిట్టిపోలు విజయలక్ష్మి శ్రీనివాస్, వైస్ ఎంపీపీ పాక వెంకటేష్ యాదవ్, వైస్ చైర్మన్ భత్క లింగస్వామి, డిఎంహెచ్‌వో పాపారావు, తహశీల్దార్ శ్రీకాంత్ రెడ్డి, డీడీవో భాస్కర్, మండల వైద్యాధికారి శ్రీవాణి, డిసిసి ఉపాధ్యక్షులు సామ మధుసూదన్ రెడ్డి పార్టీ మండల అధ్యక్షుడు పాక మల్లేష్, పట్టణ అధ్యక్షుడు భారత లవ కుమార్, పిఎస్‌ఎస్ వైస్ చైర్మన్ సామ మోహన్ రెడ్డి, నాయకులు తడక రమేష్, కాసుల అంజయ్య గౌడ్, ఉప్పునూతల వెంకటేష్, పాక రమేష్, సీత సుధాకర్, ఆడేపు అరవింద్ ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch