Saturday, March 14, 2026
Home » Fish Prasadam 2024 – చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు.. నాంపల్లి గ్రౌండ్స్ లో పంపిణీ చేస్తున్న బత్తినిసోదరులు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

Fish Prasadam 2024 – చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు.. నాంపల్లి గ్రౌండ్స్ లో పంపిణీ చేస్తున్న బత్తినిసోదరులు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 Fish Prasadam 2024 - చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు.. నాంపల్లి గ్రౌండ్స్ లో పంపిణీ చేస్తున్న బత్తినిసోదరులు - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


ముద్ర,హైదరాబాద్:-హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో శనివారం ఉదయం చేపమందు ప్రసాదం పంఫిణి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం శ్యామ్ ప్రసాద్, దానం నాగేందర్, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్, మేయర్ గద్వాల విజయలక్ష్మిలతో కలిసి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఉన్నారు.

ముందుగా చేప ప్రసాద పంపిణీ చేప ప్రసాదాన్ని దివంగత బత్తిన హరినాథ్ గౌడ్ కుమారుడు అమర్నాథ్ గౌడ్, సోదరుడు గౌరీ శంకర్‌లు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు చేప మందును వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బత్తిని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 150 సంవత్సరాలుగా చేప మందు పంపిణీ జరుగుతుందన్నారు. చాలా కాలంగా చేప మందు పంపిణీ విశ్వాసంతో ప్రజలు వేసుకుంటున్నారని తెలిపారు. అస్తమా, శ్వాస సంబంధిత వ్యాధిగ్రస్తులు ఈ ఫిష్ మెడిసిన్ వేసుకుంటారని, వివిధ దేశాలు, ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ చేప ప్రసాదం కోసం ప్రజలు వస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేప ప్రసాదం కోసం చేపలు ఏర్పాటు చేయడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ పంపిణీ కార్య క్రమం రేపటి వ‌ర‌కు కొన‌సాగనుంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch