Saturday, March 14, 2026
Home » రేపే గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌.. అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్ ఇవే… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

రేపే గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌.. అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్ ఇవే… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 రేపే గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌.. అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్ ఇవే... - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్(టీఎస్‌పీఎస్సీ) గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రేపు నిర్వహించనుంది.. రేపు ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష జరగనుంది. దీనికోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

అభ్యర్థులు ఉదయం 10 గంటలలోపు ఆయా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు. పది తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని సూచిస్తున్నారు. పది తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని అధికారులు తెలిపారు. మొత్తం 897 పరీక్ష కేంద్రాల్లో 4.03 లక్షలమంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష రాసే అభ్యర్థులకు కీలక మార్గదర్శకాలను జారీ చేశారు.

అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్ ఇవే….

  • అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు బూట్లు ధరించకూడదు, చప్పల్స్ మాత్రమే వేసుకోవాలి..
  • బయోమెట్రిక్ వేలిముద్ర వివరాల రికార్డింగ్‌లో ఉన్న అభ్యర్థులు తమ వేళ్లపై మెహెందీ లేదా ఏదైనా ఇతర ప్రింటెడ్ రంగులు ఉంచుకోరాదు.
  • కాలిక్యులేటర్‌లు, పేజర్‌లు, సెల్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, పెన్ డ్రైవ్‌లు, బ్లూటూత్ పరికరాలు, గడియారాలు తీసుకురావడం నిషేధం.
  • లాగ్ బుక్‌లు, లాగ్ టేబుల్‌లు, వాలెట్లు, హ్యాండ్‌బ్యాగ్‌లు, పౌచ్‌లు, రైటింగ్ ప్యాడ్‌లు, నోట్స్, చార్ట్‌లు, లూజ్ షీట్‌లు, ఆభరణాలు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు కూడా తీసుకురావద్దు.
  • ఐడీకార్డు, హాల్ టిక్కెట్ తప్పనిసరిగా తెచ్చుకోవాలని, హాల్ టికెట్ ఫోటో సరిగా లేకుంటే మరొక ఫోటో తెచ్చుకోవాలని అధికారులు సూచించారు.

ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.ఇది ఇలా ఉంటే గ్రూప్ 1 సర్వీస్‌లోని 563 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిప్యూటీ కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, జిల్లా పంచాయితీ రాజ్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ వంటి పోస్టులున్నాయి..

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch