Wednesday, October 30, 2024
Home » నామినేటెడ్ పోస్టుల భర్తీ దిశగా సీఎం చంద్రబాబు.. కష్టపడిన వారికి కీలక బాధ్యతలు – Sravya News

నామినేటెడ్ పోస్టుల భర్తీ దిశగా సీఎం చంద్రబాబు.. కష్టపడిన వారికి కీలక బాధ్యతలు – Sravya News

by News Watch
0 comment
నామినేటెడ్ పోస్టుల భర్తీ దిశగా సీఎం చంద్రబాబు.. కష్టపడిన వారికి కీలక బాధ్యతలు


సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న తెలుగుదేశం పార్టీ.. కేడర్ కు పదవులు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమించిన వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, డైరెక్టర్లను ఆ పదవి నుంచి తప్పుకోవాలంటూ ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది ఆయా పదవుల్లో ఉన్న వైసీపీకి చెందిన నాయకులు పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయా పదవులను టిడిపికి చెందిన నాయకులు, కార్యకర్తతో భర్తీ చేయడానికి చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారు. సాధారణంగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడానికి చంద్రబాబు నాయుడు సమయాన్ని ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. గతంలో కూడా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడానికి చంద్రబాబు నాయుడు సంకోచించేవారు. కానీ అందుకు విరుద్ధంగా ఈసారి ఆయన చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వానికి సంబంధించిన నాయకులను పదవుల్లో నుంచి దిగిపోవాలని. ఆ వెంటనే తన పార్టీకి చెందిన నాయకులను ఆయా పోస్టుల్లో నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల 2029 సార్వత్రిక ఎన్నికలకి పార్టీ కేడర్ ఉత్సాహంతో పనిచేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. వివిధ కార్పొరేషన్లకు చెందిన చైర్మన్లు, డైరెక్టర్ల పోస్టులతోపాటు జిల్లా పరిషత్, మండల పరిషత్ లో మొన్న ప్రత్యేక ఆహ్వానితుల పోస్టులు, కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్లు, వ్యవసాయ సహకార సంఘాలకు సంబంధించిన పదవులు పార్టీలు గడిచిన ఐదేళ్లుగా కష్టపడిన వారికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సిద్ధమవుతున్నారు. ఈ కావాలనే ఆయా పోస్టులకు సంబంధించిన జాబితాను ఆయన సిద్ధంగా ఉన్నట్లు ఉంది. గడచిన ఐదేళ్లుగా పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలు నాయకులు కూడా ఆయన ఇప్పటికే తెప్పిస్తున్నట్లు చూపుతున్నారు. ఎవరు సిఫారసులకు తావు లేకుండా, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి మాత్రమే ఆయా పదవులను అప్పగించాలని చంద్రబాబునాయుడు తో పాటు మంత్రి నారా లోకేష్ కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. నెల రోజుల్లో ఆయా పదవుల భర్తీ ప్రక్రియను పూర్తిచేసే అవకాశం ఉంది. నామినేటెడ్ పోస్టుల కోసం పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు లాబీయింగ్ చేస్తున్నారు. ఏదో ఒక పదవిని చేపట్టడం ద్వారా హోదాను అనుభవించే నాయకులు, కార్యకర్తలు.

జనసేనకు దక్కినా..!

రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతో ఉంది. ఆయన జగన్ ప్రభుత్వాన్ని కూలదోయడమే లక్ష్యంగా పెట్టుకొని పని చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నామినేటెడ్ పోస్టుల భర్తీకి సిద్ధమవుతున్న వేళ.. జనసేనకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యముందా అన్నదానిపై చర్చ జరుగుతుంది. నామినేటెడ్ పోస్టుల భర్తీలో జనసేనకు ఎంత శాతం ఇస్తారన్నదానిపై ఆసక్తి చూపుతోంది. అదే సమయంలో బిజెపి నుంచి కూడా పెద్ద సంఖ్యలోనే ఆశావహులు ఉన్నారు. మీరు కూడా వారికి కొన్ని స్థానాలను అప్పగించాలని కోరుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు జనసేనకు, బిజెపికి ఏ స్థాయిలో నామినేటెడ్ పోస్టులను అప్పగిస్తారో చూడాల్సి ఉంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch