Wednesday, March 18, 2026
Home » ఏపీలో డీఎస్సీ పోస్టులు.. జిల్లాల వారిగా ఉన్న ఖాళీలు ఇవే..! – Sravya News

ఏపీలో డీఎస్సీ పోస్టులు.. జిల్లాల వారిగా ఉన్న ఖాళీలు ఇవే..! – Sravya News

by News Watch
0 comment
ఏపీలో డీఎస్సీ పోస్టులు.. జిల్లాల వారిగా ఉన్న ఖాళీలు ఇవే..!


ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీని అమలు చేసేందుకు మెగా డీఎస్సీ విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు సంతకం చేశారు. మంత్రి మండల కూడా డీఎస్సీ విడుదలకు ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో జిల్లాల వారిగా ఉపాధ్యాయ ఖాళీలు ఎన్నెన్ని ఉన్నాయన్న దానిపై సర్వత్ర ఆసక్తి ఉంది. ప్రభుత్వ ప్రాతిపదికన ఉన్న ఖాళీలను ప్రభుత్వం విడుదల చేసింది ఉమ్మడి జిల్లా. రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులను భర్తీ చేయనుంది. జూలై ఒకటో తేదీలోగా విడుదల చేయవలసి ఉంది. డిసెంబర్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లా, మండల పరిషత్, మున్సిపల్ స్కూల్స్‌లో 14,066 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం పోస్టులకు సంబంధించి ఖాళీలను పరిశీలిస్తే.. శ్రీకాకుళం జిల్లాలో 543, విజయనగరం ప్రభుత్వం ప్రభుత్వం 583, విశాఖ 1134, తూర్పుగోదావరి 1346, పశ్చిమగోదావరి 1067, కృష్ణ 1213, గుంటూరు 1159, ప్రకాశం 672, నెల్లూరు 673, చిత్తూరు 1478, కర్నూలు 818, కర్నూలు 816 నిర్ధారించింది. వీటితోపాటు రెసిడెన్షియల్, మోడల్ స్కూల్స్, బీసీ గిరిజన స్కూల్స్‌లో 2,281 ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఆయా ఖాళీలను వచ్చే నెల ఒకటో తేదీన విడుదల చేయనున్న నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేయనుంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎన్నికల్లో హామీ మేరకు ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడం పట్ల నిరుద్యోగులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గడచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా నిరుద్యోగులను మోసం చేసిందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన వెంటనే తొలి సంతకాన్ని డీఎస్సీపైనే పెట్టడం ద్వారా నిరుద్యోగుల మనసును గెలుచుకుంటున్నారంటూ పలువురు విద్యార్థి సంఘం నాయకులు చెబుతున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch