Tuesday, February 24, 2026
Home » రియాసి ఉగ్రవాది స్కెచ్ విడుదల.. రూ.20 లక్షలు రివార్డు ప్రకటన – Sravya News

రియాసి ఉగ్రవాది స్కెచ్ విడుదల.. రూ.20 లక్షలు రివార్డు ప్రకటన – Sravya News

by News Watch
0 comment
రియాసి ఉగ్రవాది స్కెచ్ విడుదల.. రూ.20 లక్షలు రివార్డు ప్రకటన


జమ్మూ కాశ్మీర్‌లో బస్సుపై దాడికి పాల్పడిన ఉగ్రవాద స్కెచ్‌ను పోలీసులు బుధవారం విడుదల చేశారు. అతని గురించిన సమాచారం అందించిన వారికి రూ.20 లక్షల రివార్డును అందజేశామని చెప్పారు. రియాసిలో ఆదివారం ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడి కాల్పులు జరపగా, ఈ కాల్పుల్లో పది మంది మృతి చెందగా, తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. దీని కోసం ఇప్పటికే భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ సెర్చ్ ఆపరేషన్లో 11 భద్రతా బృందాలు పని చేస్తున్నాయి. పోనీ తెరయాత్ ప్రాంతాన్ని అన్ని వైపుల నుంచి దిగ్భందించారు. జమ్మూ, రాజౌరి జిల్లాల్లో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించి దర్యాప్తును ముమ్మరం చేశాయి. దాదాపు 20 మందిపైగా వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు పోలీసులు, ఆర్మీ సెంట్రల్‌ రిజర్వ్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌) బృందాలను మోహరించినట్టు ఉదంపూర్‌ – రియాసి రేంజ్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌(డీఐజీ) రయీస్‌ మహ్మద్‌ భట్‌ తెలిపారు. రియాసీ ఘటనకు కారణమైన ఉగ్రవాది స్కెచ్‌ను బుధవారం జమ్మూకాశ్మీర్‌ పోలీసులు విడుదల చేశారు. అతని గురించి సమాచారం అందించిన వారికి రూ.20 లక్షల రివార్డును ప్రకటించారు. ఈ దాడి వెనుక లస్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఉన్నట్టు జమ్మూ కాశ్మీర్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. సోమవారం నుంచి ఎన్‌ఐఏ ఫోరెన్సిక్ టీం ఆధారాలను సేకరిస్తోంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch