Friday, April 10, 2026
Home » మంత్రి పదవి రాకపోవడంపై బాధ లేదు : టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు – Sravya News

మంత్రి పదవి రాకపోవడంపై బాధ లేదు : టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు – Sravya News

by News Watch
0 comment
మంత్రి పదవి రాకపోవడంపై బాధ లేదు : టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు


రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి బాధ్యతలు స్వీకరించారు. మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే చంద్రబాబు ఏర్పాటు చేసిన మంత్రివర్గంపై కొన్ని విమర్శలు వస్తున్నాయి. సీనియర్ నేతలకు అవకాశాలు ఇవ్వలేదన్న అసంతృప్తి అనేకమంది నేతల్లో కూడా ఉంది. తాజాగా మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్పందించారు. మంత్రి పదవి రాకపోవడం తనకు బాధ లేదని, ఎన్టీఆర్ మంత్రివర్గంలో తనకు 25 ఏళ్లకే మంత్రి పదవి లభించింది. అప్పుడు కూడా ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నారని, అయినా తనకు అవకాశం దొరికిందని ఇప్పుడు కూడా యువతకు అవకాశాలు లభించాయి. రాష్ట్ర భవిష్యత్తు కోసం తాము కష్టపడి పనిచేసే అధికారాన్ని దక్కించుకున్నామని. జూనియర్లకు అవకాశాలు దక్కాలని, వారిని ప్రోత్సహించి అండదండగా ఉంటామన్నారు. తమలాంటి సీనియర్లకు ఎమ్మెల్యే టికెట్లు దక్కడమే గొప్ప అని, దీనికి ఓదార్పు ఎందుకన్నారు. పుస్తకాలపై సైకో ఫోటోలు ఉన్నాయని వాటిని తొలగించాలని సూచించారు. మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై తనకు ఎటువంటి బాధ లేదని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన అందించే దిశగా, అభివృద్ధిలో పరుగులు పెట్టించేలా చంద్రబాబు పరిపాలన ఉండబోతుందని అయ్యన్న పాత్రుడు జోస్యం చెప్పారు. ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch