10×6 సెం.మీ గల అరుదైన ప్యాంక్రియాటిక్ ట్యూమర్ (కణితి) శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించి రోగి ప్రాణాలను కాపాడిన వైద్యుల ఆసుపత్రి వైద్యులు
45 సంవత్సరాల మహిళ పొత్తికడుపు నొప్పితో బాధపడుతూ మెడికవర్ హాస్పిటల్స్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్ నారాయణ యర్రారపు గారిని సంప్రదించడం జరిగింది. రోగిని పరీక్షించిన డాక్టర్ ఆమెకి CT స్కాన్ చేయించుకోమని చెప్పడం జరిగింది. స్కానింగ్ లో ప్యాంక్రియాటిక్ ప్రాంతంలో సాలిడ్ సూడోపపిల్లరీ ఎపిథీలియల్ నియోప్లాజం (SPEN) అనే అరుదైన ప్యాంక్రియాటిక్ ట్యూమర్ (కణితి ) ఉన్నది అని నిర్ధారిస్తుంది. కణితి యొక్క సంక్లిష్టత మరియు అరుదైన దృష్ట్యా విప్పల్స్ ప్రక్రియ (ప్యాంక్రియాటికోడ్డెనెక్టమీ) నిర్ణయించడం జరిగింది. డాక్టర్ శ్రీమన్ నారాయణ యర్రారపు గారి వైద్య నిపుణుల బృందం సుమారు 4 గంటలు విజయవంతంగా కణితిని తొలగించడం జరిగింది.
అనంతరం డాక్టర్ గారు మాట్లాడుతూ సాధారణంగా పదిమందిలో ఒక్కరికి కనిపించే ఈ కణుతులు, సగటు వయస్సు 30-40 సంవత్సరాల వయస్సు గల యువతలో ప్రధానంగా కనిపిస్తుంది. చాల మందికి అవి 3 నుంచి 4 సెం.మీ పరిమాణంలో మాత్రమే ఉంటాయి. కానీ ఈమెకు ప్యాంక్రియాస్ మరియు పోర్టల్ సిర యొక్క తలపై దట్టంగా 10×6 సెం.మీ కణితి గుర్తించడం జరిగింది. SPEN కణితులు తరచుగా ప్యాంక్రియాస్ యొక్క శరీరం మరియు తోకలో ఉత్పన్నమవుతాయి, కానీ ఈమెకు ప్యాంక్రియాస్ యొక్క తలపై ఉంటుంది. ఈ కణితులకు కారణం చాలా వరకు తెలియదు కానీ ఇవి ప్యాంక్రియాస్‌లోని సూక్ష్మక్రిమి కణం నుండి ఉద్భవించాయని భావించడం జరుగుతుంది. శస్త్రచికిత్స అనంతరం రోగి 3 రోజుల్లోనే కోలుకుంది మరియు 5 రోజుల్లో డిశ్చార్జ్ చేయడం జరిగింది.
బేగంపేట సెంటర్ హెడ్ డాక్టర్ రాజ్ కుమార్ గారు అత్యాధునిక సౌకర్యాలు, పరికరాలు మరియు అనుభజ్ఞులైన డాక్టర్స్ వల్లనే ఇలాంటివి సాధ్యమవుతున్నాయి అని అన్నారు. డాక్టర్ శ్రీమన్ నారాయణ యర్రారపు గారిని వారి బృందాన్ని అభినందించారు.